Anchor Suma Food Stall : కుమారి ఆంటీ కి పోటీగా ఫుడ్ స్టాల్ ఓపెన్ చేసిన యాంకర్ సుమ!
Anchor Suma Food Stall : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన కుమారి ఆంటీ పేరు మారు మోగిపోతుంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళా, హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్స్ ప్లాట్ ఫార్మ్ పై పెట్టిన ఒక ఫుడ్ స్టాల్ నేడు సెన్సేషన్ గా మారింది. హైదరాబాద్ నలుమూలల్లో ఉన్న ప్రజలు మొత్తం ఈమె వద్దకి వచ్చి ఫుడ్ తినేసి పోతున్నారు. ఈమెని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే గుర్తించారంటే ఆమె ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గానే ఈమె బుల్లితెర ఈవెంట్స్ లో కూడా కనిపించడం మొదలు పెట్టింది.
త్వరలో వెండితెర పై కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇకపోతే రీసెంట్ గా యాంకర్ సుమ కుమారి ఆంటీ ని ఇమిటేట్ చేస్తూ ఒక రీల్ చేసింది. కుమారి ఆంటీ చెప్పిన ‘రెండు లివర్లు వెయ్యి రూపాయిలు’ అనే డైలాగ్ ని ఉపయోగించుకొని , తన ప్రొడక్షన్ టీం అరేంజ్ చేసిన ఫుడ్ ని అందరికీ పెడుతూ, కుమారి ఆంటీ డైలాగ్ చెప్తూ ఒక రీల్ చేసి పోస్ట్ చేసింది. దీనికి సోషల్ మీడియా లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సుమ ఇలాంటి రీల్స్ ఇది వరకు ఎన్నో చేసింది. అన్నీ రీల్స్ కంటే ఈ రీల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.