Abhishek : క్రికెట్ క్రీడలో వన్డేల్లో, టెస్టుల్లో డబుల్ సెంచరీలు ఇప్పుడు మామూలుగా మారిపోయింది. కానీ, టీ20లో మాత్రం ఇది అంత ఈజీ కాదు. లీగ్స్‌లో కొట్టొచ్చు కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ పొట్టి ఫార్మాట్లో శతకాల శాతం తక్కువే. అలాంటిది మొదటి సిరీస్‌లోనే మూడంకెల స్కోరు చేరుకున్నాడు యంగ్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 47 బంతుల్లో 100 పరుగుల మార్కుచేరుకున్నాడు. అతని ఇన్నింగ్సులో బౌండరీల కంటే సిక్సులే ఎక్కువగా ఉన్నాయి. 7 ఫోర్లు కొట్టిన అభిషేక్.. 8 భారీ సిక్సులు బాది మూడెంకలు స్కోర్ ను సునాయాసంగా సాధించాడు.
ఆ మ్యాచ్‌లో 212 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు అభిషేక్ శర్మ. ఇక ఈ సిరీస్ లో కేవలం బ్యాట్ తోనే కాదు.. బంతి తోనూ ఆకట్టుకున్నాడు. జింబాబ్వే సిరీస్‌లో ఎలాగైనా తన టాలెంట్ ను బయటపెట్టాలని అనుకున్నడు. ఒకవైపు బ్యాటింగ్‌లో బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ ఆడుతూనే బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా తన మార్క్ చూపెడుతున్నాడు. ఆ టీమ్‌తో జరిగిన నాలుగో టీ20లో మూడు ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఈ వికెట్‌తో అరుదైన ఘనతను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వల్ల కానిది అభిషేక్ సాధించాడు.
టీ20 సిరీస్‌లో సెంచరీ చేయడంతో పాటు వికెట్ తీసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ. టీమిండియా నుంచి మరే ఆటగాడు కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఆ మ్యాచ్‌లో వికెట్ తీసిన అభిషేక్‌కు బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు. జింబాబ్వే చేసిన 152 పరుగుల టార్గెట్‌ను భారత్ ఒక్క వికెట్ నష్టపోకుండా 15.2 ఓవర్లలోనే ఛేదించింది. సిరీస్‌లోని ఆఖరి టీ20లో మరోసారి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రెచ్చిపోవాలని అనుకున్నాడు అభిషేక్. మరోసారి భారీ ఇన్నింగ్స్‌తో మెరవాలని, వికెట్లతో చెలరేగాలని భావిస్తున్నాడు.