Dr. Sudhir : కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన డా.సుధీర్

Dr. Sudhir joined in TDP
Dr. Sudhir joined in TDP : చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ రాజీనామా చేశారు. వైసీపీతో పాటు మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఛైర్మన్ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్ కు పంపారు. అనంతరం అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. ఆయనకు సీఎం పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం వైసీపీ నుంచి ఏడుగురు ఎంపీటీసీలు కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.