JAISW News Telugu

Scorpion: తేలు విషం లీటర్ రూ.80 కోట్లు.. ఎందుకంటే?

Scorpion: తేలు విషం లీటర్ 10 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 80 కోట్లు పై మాటే ఉంది. తుర్కియే లోని ఒక ల్యాబ్ తేళ్ళ నుంచి రోజుకు 2 గ్రాముల విషం సేకరిస్తుంది.తేళ్లను బాక్సుల్లో పెంచి వాటిని బయటకు తీసి వాటి నుంచి ప్రత్యేక పద్ధతుల్లో విషం సేకరిస్తారు. అలా తేళ్ల నుంచి తీసిన విషాన్ని గడ్డ కట్టేలా చేసి తరువాత ఘనీభవించిన విషాన్ని పొడిగా మార్చి విక్రయిస్తారు. ఈ తేలు విషాన్ని ముఖ్యంగా యాంటీబయాటిక్స్, కాస్మోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తయారీల్లో ఉపయోగిస్తారు.

సాధారణంగా ఒక తేలులో 2 మిల్లీ గ్రాముల విషం ఉంటుంది. కాబట్టి 300 నుంచి 400 తేళ్ల నుంచి ఒక గ్రామ్ విషాన్ని సేకరిస్తారు.

Exit mobile version