Black Shape : చిమ్మచీకట్లో నల్లటి ఆకారం.. దగ్గరికి వెళ్లి చూస్తే.. గుండె ఆగినంత పని అవేంటంటే?

Black shape : దయ్యం అంటే ఎవరికైనా భయమే కదా.. నిజానికి దయ్యాలు ఉన్నాయా? కొంచెం అనుమానమే. మనలో కలిగిన భయమే దయ్యమని కొందరు అంటారు.. కాదు కాదు దేవుడు ఉన్నది నిజమైతే దయ్యం ఉన్నది నిజమని ఉపాసకులు అంటుంటారు. కానీ నిజాన్ని తీక్షణంగా పరిశోధిస్తే అసలు విషయం బయటపడుతుంది.

ఒక గ్రామంలో దయ్యం కావచ్చని గ్రామస్తులంతా భయపడ్డారు. అటు వైపు వెళ్లేందుకు జంకారు.. రోజు రాత్రి నీడలు పరుచుకుంటున్నాయని, అది ఏ జీవి అయి ఉంటుందని అంతా ఆందోళన చెందారు. అసలు విషయం తర్వాత తెలిసి ఇంతేనా అనుకున్నారు.

రోజూ మాదిరిగానే ముగ్గురు వ్యక్తులు తమ పని ముగించుకొని పొరుగు గ్రామం నుంచి తమ సొంత గ్రామానికి వస్తున్నారు. వారి పని ముగించుకొని వచ్చే వరకు చీకటి పడింది. అసలే జోరు వాన పడుతుంది. గ్రామంలోని రోడ్డుపక్కన ఒక కాలువ ఉంది. అందులో నీరు కూడా ఎక్కువగా ఉంది. సరిగ్గా ఆ నీటి ఆవాసం కాడికి వచ్చే వరకు నల్లటి ఆకారాలు కనిపించాయి. ఆ ఆకారాలు కూడా భారీగానే ఉన్నాయి. భయం.. భయంగా వెళ్లి చూసిన వారు వెనక్కి తిరిగి చూడకుండా పరుగు అందుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో మొసళ్లు కలకలం రేపుతున్నాయి. ఆత్మకూరు మండలం, మూలమూల గ్రామంలోని చెరువు కట్ట సమీపంలో గత రాత్రి మూడు భారీ మొసళ్లు గ్రామస్తులకు కనిపించాయి. దీంతో చెరువు కట్టపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా వెళ్లాలని స్థానికులు సూచిస్తున్నారు.

TAGS