Jaggery Ganapathi: ఏపీ గాజువాకలో 70 అడుగుల బెల్లం వినాయకుడు

Jaggery Ganapathi: తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను పలు రకాల ఐటెమ్స్ తో చేసి ప్రతిష్ఠించారు. ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. గాజువాకలో 20 టన్నుల బెల్లంతో అతిపెద్ద గణపతిని తయారు చేశారు. ఏపీలో ఈ ఏడాది ఈ విగ్రహమే ప్రత్యేక ఆకర్ణగా నిలుస్తోంది. విశాఖలోని గాజువాక ఆర్టీసీ డిపో పక్కన ఉన్న గ్రౌండ్ లో 70 అడుగుల భారీ బెల్లం గణనాథుడు కొలువుదీరారు. 21 రోజుల పాటు భక్తుల దర్శనాలకు అనుగుణంగా ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు.

స్థానికంగా లబించే బెల్లం వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిబడదని గుర్తించి, రాజస్థాన్ నుంచి బెల్లం తెప్పించారు. అక్కడ తయారయ్యే బెల్లం రాజస్థాన్ లో ఉండే వేడి వాతావరణం తట్టుకుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని, అందుకే అక్కడి నుంచి బెల్లం తెప్పించి భారీ గణనాథుడిని సిద్ధం చేశామని నిర్వాహకులు తెలిపారు.

TAGS