Rama Namam : రాముడు దేవుడే. కానీ మనిషి రూపంలో జన్మించాడు. అందరికా ఆరాధ్యుడైనాడు. తండ్రి కోరిక మేరకు వనవాసం వెళ్లి పద్నాలుగు ఏళ్లు అడవిలోనే గడిపిన మహా పురుషుడు. ఇచ్చిన మాటకు కట్టుబడే గుణం ఉంది. ఏకపత్ని వ్రతుడు. పిత్రువాక్య పరిపాలనదక్షుడు. తండ్రి మాట జవదాటలేని కొడుకు. ఒక అన్నగా, కొడుకుగా అతడి ప్రవర్తన అనన్యమానం. అతడిలో అన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టే అతడు సుగుణాధిరాముడు అయ్యాడు.
రాముడి జీవితం మొత్తం కష్టాలమయమే. ఎప్పుడు కూడా ప్రశాంతంగా పడుకోలేదు. నిత్యం ప్రజల క్షేమం కోసం పాటుపడ్డాడు. ప్రజలు అన్న మాట కోసమే సీతను అడవుల పాలు చేశాడు. తన విద్యుక్త ధర్మంలో ఏనాటు కూడా రాముడు పొరపాటు చేయలేదు. వారి మాటలే శాసనాలుగా జీవితమంతా కష్టాల్లోనే గడిపాడు. చక్రవర్తి అయినా తన జీవితాన్ని సుందరమయం చేసుకోలేదు.
ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. యవ్వనంలో వనవాసం, తరువాత సీత ఎడబాటు ఇలా రాముడికి ఎప్పుడు కూడా సంతోషం లేకుండానే పోయింది. పేరులోనే రాముడు జీవితంలో మొత్తం బాధలే. అలా తన జీవితం ఎన్నో వ్యధలకు కేంద్రంగా నిలిచింది. పరిపాలన కోసం ఎవరిని లెక్కచేయలేదు. వారి మాటలే శాసనాలుగా తన జీవితాన్ని పణంగా పెట్టాడు.
అందుకే అందరు రాముడిని కొలుస్తారు. రాముడి లాంటి కొడుకు కావాలని తపిస్తుంటారు. తండ్రి మాట జవదాటని పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు. ఆదర్శప్రాయమైన జీవితం గడిపినా తాను మాత్రం ఏనాడు సుఖంగా మనుగడ సాగించలేదు. నిత్యం శోకమే. ఎప్పుడు దుఖమే. 2011 జనగణన ప్రకారం మనదేశంలో 3626 గ్రామాలు రామ అనే పేరుతో ఉన్నాయి. రామ అనే పేరుకు ఎందుకంత ప్రాధాన్యం అంటే రాముడి జీవితమే నిదర్శనంగా నిలుస్తుంది.