JAISW News Telugu

Beer : బీరు ప్రియులకు బ్యాడ్ న్యూస్..ఎందుకో తెలిస్తే షాక్

Beer

Beer

Beer Lovers : ఒకప్పుడు ‘‘పోగ తాగనివాడు దున్నపోతై పుట్టును’’అనే సామెత ఉండేది. ఇప్పుడే దాన్నే ‘‘బీరు తాగనివాడు బర్రె అయి పుట్టును’’ అని మార్చుకోవాల్సి ఉందేమో.. ఎందుకంటే యూత్ నుంచి మొదలు ముసలివాళ్ల వరకు బీరు అంటే నచ్చని వారు ఒక్కరు కూడా ఉండరు. ఇక యూత్ కైతే బీరు, బిర్యానీ కాంబినేషన్ అంటే ఎంతో ఇష్టం. అన్ని రకాల వయసులు, వ్యక్తులు తాగే ఒకే ఒక బ్రాండ్ బీర్. ఆడవాళ్లు కూడా బీర్లు లాగించడం మనం చూస్తూనే ఉంటాం.

బీరు మజాను ఒక్క సారి అనుభవించిన వారు ఇక మళ్లీ మళ్లీ కావాలనుకుంటారు. అందుకే అన్ని లిక్కర్ బ్రాండ్లలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోయేది బీరే. ఇక సమ్మర్ లోనైతే బీర్లకు యమ గిరాకీ ఉంటుంది. బయట భాణుడి ప్రతాపానికి తాళలేక చల్ల చల్లని బీరు తాగితే ఉంటుంది నా సామిరంగ అంటుంటారూ యువత. ఎండకు వెళ్లొచ్చినా వారు కూల్ డ్రింక్స్ ను కోరడం సహజం. కానీ బీరు ప్రియులు మాత్రం ఎండకు వెళ్లొచ్చారంటే చాలు బార్ కెళ్లి బీర్ కొట్టం కామన్ అయిపోయింది.

దేశంలో ముఖ్యంగా తెలంగాణలో బీర్లకు ఉన్న క్రేజ్ మాములుది కాదు. దేశంలో కెల్లా అత్యధికంగా బీర్లు తాగేది తెలంగాణ జనమే. హైదరాబాద్ లాంటి మహానగరంలోనే బీర్ల సేల్ మాములుగా ఉండదు. గల్లీకో వైన్స్ షాపు, రోడ్డుకో బార్ ఉండడమే కాదు మందుబాబులకు ఏ ఇబ్బంది లేకుండా మందు లభ్యమవుతోంది. దీంతో తెలంగాణలో లిక్కర్ బిజినెస్ మూడు విస్కీలు, ఆరు బీర్లుగా వర్థిల్లుతోంది.

అయితే బీరు ప్రియులకు సమ్మర్ సందర్భంగా పెద్ద షాక్ న్యూస్. ఎందుకో తెలిస్తే చాలా బాధపడాల్సి వస్తుంది. ఇంతకీ ఏమైందంటే.. గ్రేటర్ హైదరాబాద్ లోని బీర్ల తయారీ కంపెనీలు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బీర్ల తయారీకి నీటి కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది. నగరంలోని బీర్ల తయారీ కంపెనీలకు రోజులు 44 లక్షల లీటర్ల నీరు అవసరం.

1999 తర్వాత తొలిసారిగా బీర్ల తయారీపై ఎఫెక్ట్ పడినట్టు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. డిమాండ్ కు తగ్గట్టు సరఫరా చేయలేక బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ‘‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు..’’ నీళ్లు లేకుంటే బీరు షార్టేజీ అవ్వడం, మళ్లీ అందులో రేటు పెంచడం ఏంట్రా బాబూ అని బీరు బాబులు తలలు బాదుకుంటున్నారు.

Exit mobile version