Ashwin and Shardul:ఫస్ట్ టెస్ట్‌లో తడబడ్డ టీమిండియా..డబ్ల్యూటీసీ మొత్తం ఈ ఇద్దరిపైనే చర్చ?
Ashwin vs Shardul:ఇండియా – దక్షిణాఫ్రికా జట్ల మధ్య నిన్నటి నుండి రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ స్టార్ట్ అయ్యింది.. మరి ఈ సిరీస్ సందర్భంగా టీమ్ ఇండియాలో ఒకే ఒక్క స్థానంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. మరి ఈసారి టెస్టు సిరీస్ లో తుది జట్టులో ఇద్దరు ప్లేయర్స్ లో ఎవరిని తీసుకోవాలి అనే దానిపై ఈ చర్చ జరుగుతుంది.
పేస్ ఆల్ రౌండర్ ను జట్టులోకి తీసుకోవాలా? లేదంటే స్పిన్ ఆల్ రౌండర్ ను జట్టులోకి తీసుకోవాలా? అనే చర్చ జరుగుతుంది. అయితే నిన్నటి మ్యాచ్ లో ఈ చర్చ జరిగినప్పటికీ హర్భజన్ సూచన ప్రకారం బాక్సింగ్ డే కారణంగా నిన్నటి మ్యాచ్ లో అశ్విన్ ను ఆడించారు.. అయితే నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ శార్దూల్ లేదా అశ్విన్ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలి అనేది డబ్ల్యూటీసీ ముందు ఉన్న పెద్ద సవాల్..
అయితే గత డబ్ల్యూటీసీ మైదానం పూర్తి భిన్నంగా ఉంది. ముందు నుండి పిచ్ సీమ్ కు అనుకూలంగా ఉంది.. మరి అప్పుడు ఉన్న పిచ్ పరిస్థితులను బట్టి శార్దూల్ ను తీసుకున్నారు. కానీ ఇతడు అంతగా ప్రభావం చూపించలేక పోయాడు.. మరి నిన్నటి మ్యాచ్ లో వీరిద్దరిలో అశ్విన్ ను తీసుకున్నారు. ఇక నిన్న పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండడంతో దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది..
అయితే మొదటి రోజు సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమ్ ఇండియా కొద్దిగా తడబడింది. అయినప్పటికీ కెఎల్ రాహుల్ (70) ఒంటరి పోరాటం చేసి ఆదుకున్నాడు.. అలాగే విరాట్ కోహ్లీ (38) శ్రేయాస్ అయ్యర్ (31) చేసి పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో బౌలర్ రబాడ 5 వికెట్లను తీసి ఇండియా టీమ్ ను బెంబేలెత్తించాడు.