JAISW News Telugu

IPL 2024 : ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి ఎంత డేటా కావాలో తెలుసా?

IPL 2024

IPL 2024

IPL 2024 : మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సంబరం మొదలు కానుంది. సమ్మర్ ఉక్కపోతలో క్రికెట్ ఉత్కంఠను అనుభవించడానికి కోట్లాది అభిమానులు ఎదురుచూస్తున్నారు. నెల రోజులకు పైగా క్రికెట్ మజా కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్టేడియాల్లోకి వెళ్లి ఆటను చూసే వారు కొందరుంటే..టీవీలు, స్మార్ట్ ఫోన్లలో చూసే వారే కోట్లలో ఉంటారు. స్మార్ట్ ఫోన్లలో చూసే ఓ మ్యాచ్ ను చూడడానికి కనీసం 5 గంటల పాటు చూస్తారు. దీని కోసం భారీగా డాటా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మార్చి 22 నుంచి ఐపీఎల్ సంరంభం ప్రారంభం కానుంది. జియో సినిమా యాప్ లో ఈ మ్యాచ్ లను వీక్షించవచ్చు. 4K క్వాలిటీలో ఒక పూర్తి మ్యాచ్ చూడడానికి 25 GB, 1080Pలో 12GB, 720Pలో 2.5 GB, 480Pలో 1.5 GB  అవసరం ఉంటుంది. కాగా ఎన్నికల నేపథ్యంలో తొలి 21 మ్యాచ్ ల షెడ్యూల్ ను విడుదల చేసింది. మిగతా షెడ్యూల్ ను ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 ప్రారంభం కాబోతుంది. మొదటి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ 15 రోజుల్లో నాలుగు రోజులు డబుల్ హెడర్స్ (ఒకరోజే రెండు మ్యాచ్ లు) ఉండనున్నాయి. ప్రతీ రోజు మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. డబుల్ హెడర్ ఉన్న రోజుల్లో మధ్యాహ్నం మ్యాచ్ 3.30 గంటలకు ప్రారంభం  అవుతుంది. తొలి నాలుగు రోజుల్లోనే 10 జట్లు ఒక్కో మ్యాచ్ ఆడేలా ఐపీఎల్ 2024 సీజన్ తొలి దశ షెడ్యూల్ ను బీసీసీఐ రూపొందించింది.

Exit mobile version