JAISW News Telugu

Delhi Vs Gujarat : ఢిల్లి అదరహో.. గుజరాత్ పై ఘన విజయం

Delhi Vs Gujarat

Delhi Vs Gujarat

Delhi Vs Gujarat : అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం సాయంత్రం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో పంత్ సేన గుజరాత్ టీం పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ, గుజరాత్ బ్యాటర్లను ఊపిరి తీసుకోనీయకుండా వైవిధమైన బంతులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. మొన్నటి వరకు భారీ స్కోరు మ్యాచ్ లతో ఉర్రూతలూగిన స్టేడియాలు..
లో స్కోరింగ్ మ్యాచ్ చూడాల్సి వచ్చింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు గుజరాత్ బ్యాటర్లు చేతులెత్తేశారు.

ఎనిమిది మంది గుజరాత్  బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా.. 17.3 ఓవర్లలో 89 పరుగులకే అందరూ అవుట్ అయ్యారు. దీంతో గుజరాత్ టైటాన్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. గుజరాత్ కు ఇదే తక్కువ స్కోరు కావడం విశేషం. అనంతరం ఛేజింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 8.5 ఓవర్లలోనే 90 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

గుజరాత్ బ్యాటర్లతో రషీద్ ఒక్కడే 31 పరుగులు చేయగా.. మొదటి ఇన్సింగ్స్ లో కేవలం ఒకే  ఒక్క సిక్సు నమోదైంది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ కొట్టిన ఏకైక సిక్సు అది. ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ పతనానికి కారణమయ్యాడు. ట్రిస్టన్ స్ట్రబ్స్ బౌలింగ్ చేయడం అందులో ఒకే ఓవరలో రెండు వికెట్లు తీయడం కొసమెరుపు. అభినవ్ మనోహర్, షారూఖ్ ఖాన్ ల వికెట్లను తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు.

పంత్ కీపింగ్ చాలా ఆకట్టుకుంది. స్టంపింగ్ లు, వికెట్ల వెనకాల బౌండరీలు వెళ్లకుండా ఆపిన విధానం మళ్లీ మునపటి పంత్ ను గుర్తు చేసింది. ఢిల్లీ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలోకి రావడంతో పాటు నెట్ రన్ రేట్ ను మెరుగు పరుచుకుంది. గుజరాత్ టైటాన్స్ మాత్రం ఆడిన ఏడు మ్యాచ్ ల్లో నాలుగు ఓడిపోయి మూడు మాత్రమే గెలిచి నెట్ రన్ రేట్ లో వెనకబడిపోయింది. ఇక నుంచి ఆడబోయే అన్ని మ్యాచ్ లు తప్పక గెలవాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకుంది.

Exit mobile version