Today (08-12-2023)horoscope in Telugu:నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు ఇలా..

Today (08-12-2023) horoscope in Telugu:డిసెంబ‌ర్ 8 శుక్ర‌వారం.. ఏ రాశి ఫ‌లితాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..ఈ రోజు 12 రాశుల వివ‌రాలు ఎలా ఉన్నాయి. ఆ వివ‌రాలివి.

ఒక సంఘ‌ట‌న మీ మాన‌సిక శ‌క్తిని పెంచుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ అవ‌స‌రం. సుబ్ర‌మ‌ణ్యేశ్వ‌ర స్వామి వారి ఆరాధ‌న మేలైన ఫ‌లితాల‌ను అందిస్తుంది.

మీ మీ రంగాల్లో ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. తోటివారి సూచ‌న‌లు ఉప‌క‌రిస్తాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. ముఖ్య విష‌యాల్లో కుటుంబస‌భ్యుల స‌హ‌కారం తీసుకోవ‌డం మంచిది. శివారాధ‌న శుభాల‌ను క‌లిగిస్తుంది.

ప్రారంభించిన ప‌నుల‌లో ఆటంకాలు ఎదురైనా తోటివారి స‌హాయంతో వాటిని అధిగ‌మిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మ‌ల్ని ఉత్సాహ‌ప‌రుస్తుంది. ఇష్ట‌దైవారాధ‌న శుభ‌ప్ర‌దం.

సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది. స‌మ‌యానికి స‌హాయం చేసేవారు ఉన్నారు. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. హ‌నుమాన్ చాలిసా చ‌దివితే మంచిది.

మిశ్ర‌మ కాలం. ముఖ్య‌మైన ప‌నుల‌ను కొన్నాళ్ల‌పాటు వాయిదా వేసుకోవ‌డ‌మే మంచిది. కొన్ని సంఘ‌ట‌న‌లు నిరుత్సాహప‌రుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. దుర్గాదేవిని, శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామిని పూజించ‌డం వ‌ల్ల శుభ‌ఫ‌లితాలు క‌లుగుతాయి.

మంచి కాలం. మీ ప‌నితీరుతో మీ పై అధికారుల మ‌న‌సు గెలుస్తారు. గౌర‌వ స‌న్మానాలు అందుకుంటారు. బంధువుల‌తో విబేధాలు వ‌చ్చే సూచ‌న‌లు ఉన్నాయి. స‌మ‌యానికి నిద్రాహారాలు త‌ప్ప‌నిస‌రి. విష్ణు నామ‌స్మ‌ర‌ణ చేస్తే మంచిది.

ఉద్యోగంలో శ్ర‌ద్ధ‌గా ప‌ని చేయాలి. బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. తెలివితేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కొన్ని చ‌ర్చ‌లు మీకు లాభిస్తాయి. శ్రీ‌ల‌క్ష్మీ అష్ట‌కాన్ని చ‌ద‌వాలి.

ఉత్త‌మ కాలం. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. బుద్ది బ‌లంతో కీల‌క వ్య‌వ‌హారం నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లుగుతారు. ఇంట్లో శుభ‌కార్యప్ర‌స‌క్తి వ‌స్తుంది. కుటుంబ సౌఖ్యం క‌ల‌దు. శ‌ని ధ్యాన శ్లోకం చ‌దివితే శుభ‌ప్ర‌దం.

ప్రారంభించిన ప‌నుల‌లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అంత అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. కొన్ని సంఘ‌ట‌న‌లు కాస్త మ‌న‌స్తాపాన్ని క‌లిగిస్తాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. దైవారాధ‌న మాన‌వ‌ద్దు.

అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం. ప్రారంభించ‌బోయే ప‌నుల్లో అల‌స‌ట పెర‌గ‌కుండా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. మొహ‌మాటంతో డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌కండి. బంధు, మిత్రుల‌తో మాట ప‌ట్టింపుల‌కు పోవ‌ద్దు. చెడు సావాసాలు చేయ‌రాదు. శ్రీ‌విష్ణు నామాన్ని స్మ‌రించాలి.

అధికారుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేలా ముందుకు సాగండి. స‌మ‌స్య‌లు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డ‌తాయి. తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకోకండి. మాన‌సిక ప్ర‌శాంత‌త త‌గ్గ‌కుండా చూసుకోవాలి. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నం శుభ‌ప్ర‌దం.

ప్రారంభించిన ప‌నుల‌లో విజ‌యావ‌కాశాలు ఉన్నాయి. ఆశించిన ఫ‌లితాలు ఉన్నాయి. ఇక వ్య‌వ‌హారంలో స‌హాయం అందుతుంది. ఒక శుభ‌వార్త మీ మ‌నోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవ‌బ‌లం ఉంది. ఇష్ట‌దైవారాధ‌న శుభ‌ప్ర‌దం.

TAGS