Today (06/12/2023) horoscope in Telugu:డిసెంబర్ 6, గురువారం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయి?. ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉండనుంది. వంటి వివరాలు మీ కోసం.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఈ రాశి వారికి మిశ్రమ కాలం. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కీలక పనులను మధ్యాహ్నం తరువాత ప్రారంభించడం శ్రేయస్కరం. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది.
మొదలు పెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని విజయవంతంగా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటి వారి సహకారంతో పనులు పూర్తవుతాయి. ఈ రాశివారికి శుభాలు కలగాలంటే ఇష్టదేవతా శ్లోకం చదవాలి.
మనఃసౌఖ్యం ఉంటుంది. యశోవృద్ది ఉంటుంది. కుటుంబ సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను పూర్వాహ్ణంలో చేస్తే మేలు జరుగుతుంది. ఇష్టదేవాతా ఆరాధన శుభప్రదం.
అభివృద్ధికై చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబసభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
కార్యవిఘ్నం కలగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. తోటి వారిని కలుపుకునిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.
మేలైన ఫలితాలున్నాయి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో శుభఫలాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.
ప్రయత్నకార్యానుకూలత ఉంది. అలసట చెందకుండా చూసుకోవాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఆంజనేయస్వామిని ఆరాధించాలి.
మొదలు పెట్టిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభ వార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.
పనులకు ఆటంకాలు జరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. మొహమాటంతో ఆర్ధిక ఖర్చులు పెరుగుతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం మంచిది.
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీచయకండి. దుర్గాదేవి నామాన్ని జపించడం ఉత్తమం.
శుభ సమయం. మీ మీ రంగాలలో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందక్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.