JAISW News Telugu

Today horoscope:డిసెంబ‌ర్ 15 శుక్ర‌వారం రాశి ఫ‌లాలు

 

Today horoscope:డిసెంబ‌ర్ 15 శుక్ర‌వారం ఆ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయి. ప‌న్నెండు రాశుల్లో ఎవ‌రికి ఎలాంటి శుభాలు జ‌రుగ‌నున్నాయి. ఏఏ రాశులు జాగ్ర‌త్త‌లు పాటించాలి…ఏ ఏ రాశులు త‌మ‌కు ఎదుర‌య్యే అవాంత‌రాల‌ని అధిగ‌మించాలంటే ఏమేం చేయాలి వంటి వివ‌రాలు ఈ రోజు రాశి ఫ‌లాల్లో చూద్దాం.

మీదైన రంగంలో బుద్ధిబ‌లాన్ని ఉప‌యోగించి ఒక కీల‌క స‌మ‌స్య‌ను పరిష్క‌రిస్తారు. అనుకున్న ప‌నులు విజ‌య‌వంతంగా పూర్త‌వుతాయి. అన‌వ‌స‌ర విష‌యాల‌కు దూరంగా ఉండండి. ఆదాయానికి త‌గ్గ‌ట్టే ఖ‌ర్చులు ఉంటాయి. శివ‌పార్వ‌తుల సంద‌ర్శ‌నం శుభ‌ప్ర‌దం.

మీ ల‌క్ష్యాన్ని అడుగులుగా మార్చ‌డం ద్వారా విజ‌యాన్ని సాధిస్తారు. ప‌నిలో ఏకాగ్ర‌త లోపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డండి. కీల‌క నిర్ణ‌యాలు తీసుకోబోయే ముందు బాగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి. ధ‌న‌యోగం మిశ్ర‌మంగా ఉంది. శ్రీ‌ల‌క్ష్మీదేవి ఆరాధ‌న శ్రేష్టం.

అనుకూల‌మైన స‌మ‌యం. మొహ‌మాటాన్ని ప‌క్క‌న‌పెడితే ఇబ్బందులు ద‌రిచేర‌వు. ఉన్న‌త‌మైన ఆలోచ‌న‌లు చేసి వాటిని సాధించే వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌రు. ఆర్థికాభివృద్ధి క‌ల‌దు. శ్రీ‌ల‌క్ష్మీగ‌ణ‌ప‌తి ఆరాధ‌న ఎంత‌గానో స‌హ‌క‌రిస్తుంది.

ఉద్యోగ‌స్తుల‌కు శుభ‌కాలం. శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ఉంటుంది. ఒక ముఖ్య‌మైన విష‌యంలో పై అధికారుల స‌హ‌కారం అందుతుంది. స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేస్తారు. ఆర్థిక పరంగా శుభ‌కాలం. శివ నామం జ‌పించాలి.

మీరు వేయ‌బోయే అడుగు గురించి స్థిరంగా ఆలోచించాలి. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో శ్ర‌మ‌కు త‌గ్గ ప్ర‌తిఫ‌లం ఉంటుంది. ఆర్థిక‌ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. దుర్గాధ్యానం శ్రేయోదాయ‌కం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫ‌లితాలు సాధించ‌డానికి శ్ర‌మ అధికం అవుతుంది. ఎవ‌రినీ అతిగా న‌మ్మ‌రాదు. ఆర్థికంగా మేలైన ఫ‌లితాలున్నాయి. సూర్య న‌మ‌స్కారం చేస్తే మంచిది.

మీ ఆత్మ‌విశ్వాస‌మే మీ విజ‌యం. ఉద్యోగ‌స్తుల‌కు మంచి కాలం. వ్యాపారంలో పెట్టుబ‌డులు పెట్ట‌బోయే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించాలి. ఆర్థికంగా ఫ‌ర‌వాలేద‌నిపిస్తుంది. `ఓం ఐం హ్రీం శ్రీ కామ‌క్షే న‌మః` అనే నామాన్ని జ‌పించాలి.

మీ మీ రంగాల్లో అభివృద్ధి సాధించాల‌నే త‌ప‌న మిమ్మ‌ల్ని గెలుపు బాట ప‌ట్టిస్తుంది. అవ‌స‌రానికి త‌గిన ధ‌నం చేతికి అందుతుంది. ఒక శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. ఈశ్వ‌ర ధ్యానం స‌త్ఫ‌లితాన్ని ఇస్తుంది.

విజ‌యానికి వెనుకున్న ప‌ర‌మ ర‌హ‌స్యం కృషి ఒక్క‌టే అని తెలుసుకుంటారు. ప్రారంభించిన ప‌నుల్లో ఆనంద‌క‌ర‌మైన ఫ‌లితాలు సాధిస్తారు. తోటివారితో సంతోష‌క‌ర‌మైన కాలాన్ని గ‌డుపుతారు. ధ‌న‌లాభం సూచితం. శ్రీ‌వినాయ‌క సంద‌ర్శ‌నం మేలు చేస్తుంది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో క‌ష్టేఫ‌లి అనే సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని అంద‌రిని క‌లుపుకుని పోవ‌డం వ‌ల్ల ప‌నులు సుల‌భంగా పూర్త‌వుతాయి. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు ఖ‌ర్చు చేయాలి. శ‌ని శ్లోకం చ‌దువుకోవాలి.

స‌వాళ్ల‌ని స్వీక‌రించి వాటిని ఎదుర్కొనే త‌త్వం మిమ్మ‌ల్ని విజ‌యానికి చేరువ చేస్తుంది. గిట్ట‌ని వారు చాప కింద నీరులా ఇబ్బంది పెడ‌తారు. స్థిర సంపాద‌న క‌ల‌దు. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ అవ‌స‌రం. శ్రీ ల‌లితాదేవి నామ‌స్మ‌ర‌ణ శుభ‌ప్ర‌దం.

మంచి ఆలోచ‌న‌ల‌తో మీరు చేసే ప‌ని స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుంది. మీ ప్ర‌తిభే మీకు ఆయుధం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా త‌ట్టుకుని ముందుకెళ‌తారు. ఆర్థికంగా ఫ‌ర్వాలేదు అనిపిస్తుంది. దైవ‌బ‌లం పెర‌గ‌డానికి గురు ధ్యాన శ్లోకం చ‌ద‌వాలి.

 

Exit mobile version