16th November Horoscope : మేష రాశి వారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. బుద్ధి స్థిరంగా ఉండదు. మనోధైర్యం కలిగి ఉండాలి. ఈశ్వర నామ స్మరణ మంచి ఫలితాలు ఇస్తుంది.
వ్రషభ రాశి వారికి ఆధ్యాత్మికత వైపు ఆలోచిస్తారు. ఒక వార్త మీకు చేదు ఫలితం కలిగిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టదేవతను ప్రార్థించడం మంచిది.
మిథున రాశి వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొత్తగా పనులు చేపడతారు. సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతను ఆరాధించడం మేలు కలిగిస్తుంది.
కర్కాటక రాశి వారికి భవిష్యత్ ప్రణాళిక వేసుకుంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ఆలోచనలతో పనులు చేపడతారు. శివనామం జపించడం చాలా మంచిది.
సింహ రాశి వారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తలు పాటించాలి. సలహాలు, సూచనలు వినాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
కన్య రాశి వారికి ఆర్థిక సాయం దక్కుతుంది. కొత్త వస్తువులు కొంటారు. అధికారుల అండ ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
తుల రాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. ఆర్థిక లాభం ఉంది. శుభ ఫలితాలు ఉన్నాయి. లక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదవడం శుభకరం.
వ్రశ్చిక రాశి వారికి కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనోబలం పెరుగుతుంది. గణపతి స్తోత్రం చదవడం వల్ల మేలు చేస్తుంది.
ధనస్సు రాశి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. బుద్ధి బలం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళతారు. ఇష్టదైవాన్ని పూజించడం మంచిది.
మకర రాశి వారికి మనోల్లాసం పెరుగుతుంది. సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. శివారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
కుంభ రాశి వారికి పనులు వేగంగా పూర్తి చేసుకుంటారు. వ్యాపారంలో బాగుంటుంది. బంధువుల సహకారం ఉంటుంది. ఇష్టదేవతారాధన మంచి చేస్తుంది.
మీన రాశి వారికి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. మంచి విషయాలపై ఫోకస్ పెడతారు. అందరి సహకారాలు లభిస్తాయి. దుర్గాధ్యానం చేయడం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.