Jagan: 7-Eleven ఇప్పుడు Jagan-11.. ఫన్నీ మీమ్

Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత దారుణమైన ఓటమి పాలైన జగన్ పై మీమ్స్ ఆగడం లేదు. సాధారణంగా శత్రువైనా సరే ఓటమిపాలైతే ఎంతో కొంత సానుభూతి చూపెడతాం. ఒక దశలో అయ్యో అని కూడా అంటాం. కానీ జగన్ ఓడిపోయినా ఆయనపై ఎవరూ సానుభూతి చూపడం లేదు. దాదాపు ఈ నాయకుడికి మాత్రమే ఇది జరిగినట్లు కనిపిస్తుంది. ఇంకా పైపెచ్చు విపరీతమైన మీమ్స్ చేస్తూ అయ్యో అనకపోగా నవ్వుకుంటున్నారు. ఇది ఏపీలో పరాకాష్టకు చేరింది. కనిపించిన, వినిపించిన ప్రతీ అంశంపై మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

 

7-Eleven అనేది ఒక అమెరికన్ కన్వీనియన్స్ స్టోర్ చైన్. దీని ప్రధాన కార్యాలయం టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో ఉంది. 7-Eleven జపాన్ కో., లిమిటెడ్ ద్వారా జపనీస్ కంపెనీ సెవెన్ అండ్ ఐ హోల్డింగ్స్ యాజమాన్యంలో ఉంది. డల్లాస్‌లోని ఒక ఐస్ హౌస్ స్టోర్ ఫ్రంట్ లో ఈ చైన్ 1927లో స్థాపించబడింది. 1928-1946 మధ్య ‘Tote’m’ స్టోర్స్ అని పేరు పెట్టారు. ఇటో-యోకాడో, జపనీస్ సూపర్ మార్కెట్ చైన్, 7-Eleven జపాన్ మాతృ సంస్థ, 1991లో కంపెనీలో 70 శాతం వాటాను కొనుగోలు చేసిన తర్వాత, కంపెనీ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా మారింది. ఈ సంస్థ ఇండియాలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ 7-India కన్వీనియన్స్ రిటైల్ లిమిటెడ్ ద్వారా 7-Eleven స్టోర్ కొనసాగుతుంది.

 

ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం జగన్ ను 7-Eleven స్టోర్ ను కలిసి మీమ్ క్రియేట్ చేశారు. అటు ఏడు కొండలవాడి నామాలు, గుండు కనిపించేలా 7-Eleven స్టోర్ ను Jagan-11 గా మార్చి నడుపుకోవాలంటూ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

TAGS