JAISW News Telugu

Poor CM Europe Tour : పేద సీఎం యూరప్ టూర్ ఖర్చు ఎంతంటే..?

Poor CM Europe Tour

Poor CM Europe Tour

Poor CM Europe Tour : ఏపీ ఎన్నికలు సమరాన్ని తలపించాయి.  అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరిగినా ఓ రకంగా చెప్పాలంటే ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. అయితే ఓటమి ఖాయమని పలు అనధికార సర్వేల ద్వారా తెలియడంతో వైసీపీ మూకలు రాష్ట్రంలో పలుచోట్ల దాడులకు దిగాయి. ఇది ఎంత వరకు వెళ్లిందంటే కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవాల్సి వచ్చింది. పలువురు ఉన్నతాధికారులపై వేటు వేశారు.

ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన అల్లర్లతో తనకేం సంబంధం లేనట్టుగా సీఎం జగన్ కుటుంబంతో కలిసి లండన్ టూర్ కు వెళ్లారు. సీఎం జగన్ తనకు తాను నిత్యం పేదవాడినని చెబుతుంటారు. పెత్తందారులతో యుద్ధం చేస్తున్నానని, అందరూ పేదవాడినైనా తనకు అండగా నిలువాలని సభల్లో పిలుపునిస్తుంటారు. తనకు ఫోన్ సైతం లేదని ఇటీవలే చెప్పారు. అయితే అవన్నీ ఉత్త మాటలే అని అందరికీ తెలుసు. ప్రస్తుత లండన్ పర్యటనపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. పెత్తందారులంతా భూమిపైనే ఉన్నారని, పేదవాడు మాత్రం విమానాల్లో విహరిస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

వైఎస్ జగన్ టూర్ ఖర్చుపై నెటిజన్లు విశ్లేషణలు చేస్తున్నారు. వాస్తవానికి ఇది కుటుంబ పర్యటన కావడంతో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖాతాల్లోంచి ఖర్చు చేయవద్దు. కానీ సీఎంగా ఆయన రక్షణ కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దాదాపు రెండు వారాల పాటు ఆయనకు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తోంది. విస్టా జెట్ కంపెనీకి బొంబార్డియర్ 7500 అనే అత్యంత విలాసవంతమైన విమానంలో జగన్ కుటుంబ సమేతంగా లండన్ వెళ్లారు.

దాని ఖర్చు గంటకు రూ.12 లక్షలు. అంటే గంటకు 12లక్షలు ఖర్చు పెట్టే వ్యక్తి పేదవాడా? పెత్తందారా? అంటూ టీడీపీ మద్దతుదారు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ కు రక్షణగా నలుగురు అధికారులు లండన్ కు వెళ్లారు. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతరాత్ర ఖర్చులు కలిపి కోటిన్నర దాక ఖర్చవుతుంది. ఈ ఖర్చు  అంతా ప్రభుత్వానిదే. ఇక ఈ టూర్ రెండు వారాల్లో ఎంత ఖర్చవుతుందో ఆ దేవుడి తెలియాలి అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Exit mobile version