KomatiReddy:ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరంగా స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గత ప్రధాని మన్మోన్ సింగ్, సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఏపీని ఆదుకోవాలని పార్లమెంట్లో ఇచ్చిన హామీ అది అని స్పష్టం చేశారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం బాధాకరం అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారని, అయితే ప్రస్తుత ప్రధాని దానిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాని ప్రకటించని విషయం తెలిసిందే.