Nalimeal Bhaskar: ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్ కు ప్రజాకవి కాళోజీ పురస్కారం

Nalimeal Bhaskar: ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత నలిమెల భాస్కర్ 2024 కాళోజీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా పురస్కారం ప్రదానం చేయనున్నారు. 1956 ఏప్రిల్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ లో భాస్కర్ జన్మించారు. 2013 సంవత్సరానికి గాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన ‘స్మారక శశిగల్’ నవలను నలిమెల భాస్కర్ ‘స్మారక శిలలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు.

ఈ నెల 9న కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో భాస్కర్ కు ‘కాళోజీ’ అవార్డు అందిస్తారు. అవార్డు కింద రూ.1,01,116 నగదు రివార్డు, జ్ఞాపిక అందించి శాలువాతో సత్కరించనున్నారు. ప్రతి ఏటా ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ ను వరించిన సంగతి తెలిసిందే.

TAGS