Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఆస్తులు అందుకే అమ్ముతున్నారా? తెలంగాణను వీడుతారా?

Pawan Kalyan
Pawan Kalyan : జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల తన సంపాదనలో 10 కోట్ల రూపాయలను జనసేన పార్టీ సంక్షేమం, భవిష్యత్ కోసం విరాళంగా ఇచ్చారు. దీంతో పాటు ఆర్మీలో పని చేస్తూ అమరులైన వారి కుటుంబాలకు, రైతులకు కూడా పెద్ద మొత్తంలో విరాళం అందజేశారు. పవన్ కళ్యాణ్ పై ‘ప్యాకేజీ’ వ్యాఖ్యలు ఎక్కడా ఆగడం లేదు.. కానీ జనసేనాని మాత్రం పట్టించుకునే స్థితిలో లేనట్లు కనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ లోని తన సొంత ఆస్తులను అమ్మేస్తున్నారు అని తెలిసింది. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా గెలవడం దాదాపు అసాధ్యమని పవన్ కళ్యాణ్ తన తాజా ప్రసంగంలో బాహాటంగానే చెప్పారు. ఆ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్ లోని తన ఖరీదైన భూములను అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక భూమిని అమ్మేశారని, మరో రెండు ఆస్తులు అమ్మే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో చాలా మంది రాజకీయ నాయకులు డబ్బు సంపాదించడం మామూలే.. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం, పార్టీ కోసం ఇలా చేయడం పార్టీ మద్దతుదారులను కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.
జనసేన క్యాడర్ లో సీట్ల సర్దుబాటు గందరగోళం మధ్య పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా అడుగులు వేస్తున్నారనే వార్త జనసేన క్యాడర్ ను భావోద్వేగానికి గురి చేస్తోంది. పవన్ కళ్యాణ్ ను విమర్శించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని జనసేన మద్దతుదారులు సోషల్ మీడియాలో కేడర్ ను వేడుకుంటున్నారు.