Nirab Kumar : అత్యధిక మెజారిటీతో గెలిచిన చంద్రబాబు నాయుడు పాలనా పరమైన విధుల్లో నిమగ్నమయ్యారు. రెండు రోజుల (జూన్ 9) తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయన తన టీంను రెడీ చేసుకంటున్నారు. పగ్గాలు అందుకోవడంతో పాలనను పరుగులు పెట్టించాలని అధికారులను సమాయత్తం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న వారిని పక్కన పెట్టి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగానే తెరపైకి వచ్చిన పేరు నీరబ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ సీఎస్ (చీఫ్ సెక్రెటరీ) గా నీరబ్ ను నియమితులయ్యే అవకాశం ఉంది.
నీరబ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బుధవారం (జూన్ 5) రోజున వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి సెలవులో వెళ్లాడు. ఆయన పదవీ కాలం కూడా కొన్ని రోజులే ఉండడంతో అప్పటి వరకు ఆయన సెలవుల్లోనే ఉండనున్నారు. ఇక తర్వాతి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కానున్నారు. దీంతో నీరబ్ గురించి తెలుసుకునేందుకు తెలుగు వారు ఆరాట పడుతున్నారు. అసలు నీరబ్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన కేపబులిటీపై చర్చలు కొనసాగుతున్నాయి.
నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్, సైన్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. IIT ఢిల్లీ, IIM బెంగుళూర్, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి అయిన నీరబ్ కు ప్రజలకు దగ్గరుండడం చాలా ఇష్టం. అందుకే ఐఏఎస్ ఎంచుకున్నారు. ప్రభుత్వాలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో చాక చక్యంగా నడిపించేవారు. ఆయన ప్రతిభను చూసిన చంద్రబాబు ఆయననే తన చీఫ్ సెక్రటరీగా ఎంచుకున్నారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇవ్వనుంది.