Amaravati: ఏపీలో సంచలనం సృష్టించిన ముంబై నటి కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తాజాగా విజయవాడ సీఐడీ కోర్టు మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతినిచ్చింది. దీంతో విచారణ నిమిత్తం కుక్కల విద్యాసాగర్ ను గుంటూరు తీసుకువచ్చిన పోలీసులు, తొలుత జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే మూడు రోజుల పాటు విద్యాసాగర్ ను సీఐడీ అధికారులు విచారించనున్నారు.