JAISW News Telugu

Rahul Gandhi ఫ మహారాష్ట్ర ఎన్నికలు.. రాహుల్ గాంధీ బ్యాగ్ లు తనిఖీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi ఫ మహారాష్ట్రలో ఇటీవల శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఈసీ అధికారులు పదే పదే తనిఖీ చేయడం, ఇందుకు సంబంధించిన వీడియోను ఠాక్రే విడుదల చేయడంతో వివాదం మొదలైంది. పీఎం, బీజేపీ నేతలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు చేస్తారా అని ఠాక్రే నిలదీశారు. తాజాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్యాగులను ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ కాగానే ఈసీ అధికారులు శనివారం తనిఖీలు చేశారు. వారు బ్యాగులు తనిఖీ చేస్తుండగా రాహుల్ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు అనుమతులు ఇవ్వడంలో 45 నిమిషాల పాటు శుక్రవారం ఆలస్యం జరగడం, దానిపై రగడ చోటు చేసుకున్న క్రమంలో తాజా ఘటన చోటు చేసుకుంది.

కాగా, కొందరు ఎంపిక చేసిన నేతలనే తనిఖీలు చేస్తున్నారంటూ విపక్షాల ఆరోపణల క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ సహా పలువురు ఎన్డీయే నేతల బ్యాగేజీలను కూడా ఈసీ అధికారులు ఇటీవల తనిఖీలు చేశారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో ఈనెల 20న పోలింగ్ జరుగనుంది. నవంబరు 23న ఫలితాలు వెలువడతాయి.

Exit mobile version