KTR : ఆ భూముల విషయంలో రేవంత్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
KTR : ఆగస్ట్ 15వ తేదీలోగా రూ. 2 లక్షల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ గతలంలో సవాల్ చేశారు. కాగా.. రుణమాఫీ, పథకాల అమలుకు నిధుల సమీకరణకు రేవంత్ సర్కార్ నానా తంటాలు పడుతోంది. ఇందులో భాగంగా కోకాపేట, రాయదుర్గంలో వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ ఫైనాన్స్ వద్ద తాకట్టు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం. ఈ భూములను తనఖా పెట్టడంపై రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ ఫైనాన్స్ వద్ద తనఖా అంటే వడ్డీ భారీగానే ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
రీసెంట్ గా ఇదే అంశంపై సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని నడపడం చేతకాని రేవంత్ సర్కార్ నిధుల సమీకరణకు ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుందని ఆరోపించారు. పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. దీనికి మధ్యవర్తిగా ఓ మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టుకొని వారికి రూ.100 కోట్ల కమీషన్ ఇస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు.
ఈ చర్యతో తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమల రాక, ఉద్యోగాల రాక.. తెలంగాణ బిడ్డలకు కొలువులు లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. రాయదుర్గం, కోకాపేట ప్రాంతానికే ఐటీ పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నాయని, అలాంటి చోట 400 ఎకరాల ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని కేసీఆర్ అభివర్ణించారు.
ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం స్తబ్ధుగా ఉందని.. కొత్త పెట్టుబడులు రావడం లేదని.. సరైన ప్రోత్సాహం లేక ఉన్న కంపెనీలు కూడా పక్క చూపులు చూస్తున్నాయన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏం ఇస్తారని కేటీఆర్ నిలదీశారు. పరిశ్రమలు రాకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ట్వీట్ చేశారు.
రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని… pic.twitter.com/E2EWqT0hve
— KTR (@KTRBRS) July 10, 2024