KTR:భార్య శైలిమ‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ కేటీఆర్

 

KTR:బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు 20వ పెళ్లి రోజు నేడు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న స‌తీమ‌ణి శైలిమ‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. `నా అంద‌మైన అర్థాంగి శైలిమ‌కు 20వ పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు` అని పోస్ట్ చేశారు. అంతే కాకుండా త‌న స‌హ‌ధ‌ర్మ‌చారినిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

`రెండు ద‌శాబ్దాల పాటు కొండంత అండ‌గా నిలిచినందుకు, నాకు ఇద్ద‌రు అంద‌మైన పిల్ల‌ల‌ను ఇచ్చినందుకు, నా జీవితంలో గొప్ప భాగ‌స్వామిగా ఉన్నందుకు నీకు ధ‌న్య‌వాదాలు` అని తెలిపారు. `మ‌నం ఇలాగే క‌ల‌కాలం క‌లిసుండాలి` అంటూ త‌న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌కు త‌న పెళ్లినాటి ఫొటోను,భార్యాపిల్ల‌ల‌తో దిగిన మ‌రో ఫొటోను జ‌త చేశారు.

ఇదిలా ఉంటే కేటీఆర్‌, శైలిమ‌ల కుమారుడు హిమాన్షురావు కూడా త‌ల్లిదండ్రుల పెళ్లిరోజును పుర‌స్క‌రించుకుని సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు తెలిపారు. `అమ్మానాన్న‌ల‌రు 20వ పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు` అని పోస్ట్ చేశాడు. `మీరిద్ద‌రూ నా పేరెంట్స్ అయినందుకు నేను చాలా అదృష్ట‌వంతుడిని` అని పేర్కొన్నాడు. `నేను మిమ్మ‌ల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాను` అంటూ త‌ల్లిదండ్రుల‌పై త‌న‌కున్న ప్రేమ‌ని కురిపించాడు. ఈ సంద‌ర్బంగా త‌ల్లిదండ్రులు కేటీఆర్‌, శైలిమ‌ల‌తో క‌లిసి ఉన్న ఫొటోని, కేటీఆర్‌, శైలిమ ఉన్న మ‌రో ఫొటోని షేర్ చేశాడు.

TAGS