TDP And Janasena Joint Strategy : టీడీపీ, జనసేన ఉమ్మడి వ్యూహం.. వైసీపీ టార్గెట్ గా కీలక నిర్ణయాలు
TDP And Janasena Joint Strategy : ఏపీలో టీడీపీ, జనసేన కలిసి రానున్న ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ కి పెద్ద సపోర్ట్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక రానున్న ఎన్నికల్లో పొత్తు ఉంటుందని ఆయన నేరుగా ప్రకటించారు. ఇక ఇటీవల ఉమ్మడి సమావేశం రాజమండ్రిలో నిర్వహించగా, మేరకు ఉమ్మడి మ్యానిఫెస్టో తయారీపై ఇరు పార్టీల కమిటీ సిద్ధమైంది.
వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇరు పార్టీల సమన్వయ కమిటీ చర్చిస్తున్నది. దీంతో పాటు ఇక నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి కూడా సమావేశం కానున్నాయి. రెండు, మూడు రోజుల తర్వాత ఇరు పార్టీలు ఉమ్మడిగా ప్రచారరం మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఇక సమన్వయం చేసుకునే అంశంలో జనసేన 175 నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను నియమించింది. అయితే ఉమ్మడి మ్యానిఫెస్టోలో 11 అంశాలపై చర్చ జరిగిందది. వీటిలో ఇరు పార్టీల సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగా అమరావతి రాజధానిగా కొనసాగింపు, పేదలందరికీ ఉచిత ఇసుక సరఫరా, బీసీలకు రక్షణ చట్టం కీలకంగా ఉన్నాయి. అయితే సీట్ల విషయం కొలిక్కి వస్తేనే కానీ, అసలు విషయం తేలనుంది. ఇప్పటికైతే కొంత శ్రేణుల్లో ఇంకా అయోమయం మాత్రం పోలేదు. ఇప్పటికే ఈ సీట్ల పంపిణీ వ్యవహారంలో అధినేతలు ఒక ఒప్పందానికి వచ్చారని టాక్ అయితే బయట నడుస్తున్నది. మరి ఇలాంటి సందర్భంలో ఇక ఇరు పార్టీల శ్రేణులు ఎన్నికల్లో వైసీపీని టార్గెట్ చేసి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నాయి.