Jagan Coverts : ఏపీలో ఎటు చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ఎలాగైనా గెలవాలనే టార్గెట్ తో ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనలు దాదాపు పూర్తికావడంతో ప్రచారంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ సమయంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఎక్స్ లో సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకు ఈసారి టికెట్ రాకపోవడంపై చేసిన వ్యాఖ్యలతో నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు మ్యాచ్ అవుతున్నాయి.
రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే దాదాపు టికెట్ల పంపకాలు పూర్తిచేశాయి. అయితే ఇందులో రఘురామకు టికెట్ రాకపోవడంతో బీజేపీలో ఉన్న సోము వీర్రాజు ద్వారా తనకు టికెట్ రాకుండా జగన్ అడ్డుకున్నారని సంచలన ఆరోపణ చేశారు. అయితే ఇప్పుడు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా ఇవే ఆరోపణలు చేస్తూ పోస్ట్ పెట్టారు.
బీజేపీలో కొందరు నేతలు టీడీపీని, ఆ పార్టీలో అగ్రనేతలను విమర్శిస్తూనే ఉంటారని, అలాగే బీజేపీలో చాలా మంది జగన్ కోవర్టులు ఉన్నారని అందరికీ తెలిసిందేనని ఆయన తెలిపారు. వీరంతా చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేనతో ఎన్నికల పొత్తులోకి వెళ్లిందని, కానీ జగన్ తో ఇంత లోతైన బంధాలు తెంచుకుని పార్టీ కోసం ఆయా నేతలు పనిచేస్తారా? అని ప్రశ్నించారు.
కానీ ఎన్డీఏ ఏపీలో మెజార్టీ అసెంబ్లీ, లోక్ సభ సీట్లు సాధించాలంటే మాత్రం కేంద్ర నాయకత్వంలోని మోడీ, అమిత్ షా, నడ్డా జోక్యం చేసుకుని పార్టీలో కోవర్టులను, జగన్ అనుకూల కుట్రదారులను బీజేపీ విజయం కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలని హెచ్చరించాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సూచించారు. అప్పుడే రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏకు మెజార్టీ సీట్లు వస్తాయన్నారు.
Till the other day the @BJPLive leaders/cadre in AP have been very critical of @JaiTDP and its top leadership.
It is also not a secret that many leaders of @BJP4Andhra have been coverts of Y S Jagan and they work(ed) against @ncbn and @iTDP_Official sometimes even going to the… pic.twitter.com/hBca84aeiK
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) March 25, 2024