Vijayasai Reddy : ఏపీ ఎన్నికల రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీ పీ -జనసేన కూటమి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన అభ్యర్దుల తొలి జాబితాను ప్రకటించాయి. బీజేపీతో పొత్తు పైన స్పష్టత వచ్చిన తరువాతనే ఎంపీ స్థానాలు ప్రకటించాలని భావిస్తున్నాయి. ఈ సమయంలోనే వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి టీడీపీలో చేరుతు న్నారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేయనున్నారు. దీంతో, జగన్ ఆయన పైన పోటీ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్దిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని జగన్ ఖరారు చేసారు. సరిగ్గా వేమిరెడ్డి టీడీపీలో చేరటానికి కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయ సాయిరెడ్డి ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అదే విధంగా టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్న వేమిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగలేదు.
ఇద్దరూ రాజ్యసభ సభ్యులే. ఇద్దరూ నెల్లూరు జిల్లా లో ఆర్దికం గా బలవంతులు. ఒకరి బలాలు – బల హీనతల పైన మరొకరికి పూర్తి స్పష్టత ఉంది. సా యి రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో గుంటూరు, పల్నా డు పర్యవేక్షణ బాధ్యతలు చూడాలని జగన్ నిర్దేశిం చారు. కానీ, వేమిరెడ్డి పార్టీ మార్పు నిర్ణయంతో నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపాలని నిర్ణయించారు.
రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం : విజయసాయి రెడ్డి తొలి నుంచి వైసీపీ నెల్లూరు జిల్లాల ఇంఛార్జ్ గా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు పార్ల మెంట్ కు జరిగిన ఒక ఉప ఎన్నిక, రెండు సార్వ త్రిక ఎన్నికల్లొనూ వైసీపీ అభ్యర్దులే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. కొద్ది కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో జిల్లాలో సమీకరణాలు మారిపో యాయి. జిల్లా నుంచి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరారు.
అందులో ఇప్పటికే కోటంరెడ్డికి టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ ఖాయమైంది. ఆనంకు సైతం ఆత్మకూరు లేదా సర్వేపల్లి సీటు ఇస్తారని తెలు స్తోంది. ఇక..ఈ ఎన్నికల్లో రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావటంతో వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారు. అందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి.