Lulu Group: విశాఖలో అంతర్జాతీయస్థాయి షాపింగ్ మాల్ నిర్మిస్తామని లులు గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబుతో లులు గ్రూప్ ప్రతినిధులు శనివారం భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ.. తమకు సాదర స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుతో తనకు 18 ఏళ్ల అనుబంధం ఉందన్న లులూ గ్రూప్ ఛైర్మన్.. సీఎంతో జరిపిన చర్చలు ఫలవంతమైనట్లు తెలిపారు.
విశాఖపట్నంలో 8 స్క్రీన్ల ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ సహా అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు లులూ గ్రూప్ ఛైర్మన్ తెలిపారు. అలాగే విజయవాడ, తిరుపతిలో హౌపర్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటుగా ఏపీలో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ట్వీట్ చేశారు.