JAISW News Telugu

Minister Property Valued : ఆ మంత్రి ఆస్తి విలువ రూ. 20వేల కోట్లు.. ఐటీ చొరవతో బయటపడ్డ చిట్టా..

Minister Property Valued

Minister Property Valued

Minister Property Valued : రాజకీయ నాయకుల ప్రారంభ జీవితం.. ఆస్తులను చూస్తే అస్సలు పొంతన ఉండదు. డబ్బు కోసం పదవులను ఎంచుకుంటారో.. లేక సేవ కోసం ఎంచుకుంటారో తెలియడం చాలా కష్టం. కొందరు నిశ్వార్థ రాజకీయ నాయకులు ఎన్నో సేవలు చేస్తూ దేశ కీర్తిని చాటితే మరికొందరు భారీ స్కాంలతో అప్రతిష్ట తీసుకువస్తున్నారు. ఇవన్నీ పక్కను ఉంచితే ఇక్కడొక పొలిటీషియన్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగకమానదు.

తమిళనాడు రాష్ట్రానికి కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్ లో పని చేసిన మంత్రి ఈవీ వేలు (ఎతిలుం వల్లవర్ వేలు). ఈయన 1984లో తండారంబట్టు నియోజకవర్గం నుంచి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 1997లో, DMKలో చేరారు. 2001, 2006లో అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. 2011, 2016 లో ద్రవిడ మున్నేట్ర కజగం అభ్యర్థిగా తిరువణ్ణామలై నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఆయన స్టాలిన్ ప్రభుత్వంలో ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

కరుణానిధి ప్రచారంలో రిక్షాలాగుతూ కనిపించిన ఈవీ వేలు ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సమయంలో అలా ఉన్న ఆయన ఆస్తులు లెక్కకు మించి సంపాదించారు. ఇటీవల ఆయన ఆస్తులపై ఐటీ దాడులు నిర్వహించింది. అందులో 1200 కోట్ల ఎగవేతకు పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 20 వేల కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.

Exit mobile version