JAISW News Telugu

Nara Lokesh : ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఎత్తివేస్తాం: నారా లోకేశ్

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh : వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులపై వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన ప్రసంగించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని, ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల విధులపై జీవో 117కు ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నామని, ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేస్తామని తెలిపారు.

ఉపాధ్యాయులతో చర్చకు సిద్ధమన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోవడానికి కేటాయించామని తెలిపారు. డీఎస్సీపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని, వచ్చే విద్య సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. డీఎస్సీకి సంబంధించి కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని, న్యాయపరంగా ఎలాంటి వివాదాలు తావు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు.

Exit mobile version