JAISW News Telugu

CM Revanth Reddy: వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి: పీఎం మోదీకి సీఎం రేవంత్ లేఖ

CM Revanth Reddy: తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటించాలని, వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరుతూ పీఎం నరేంద్ మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రానికి తక్షణ సాయం అందజేయాలని లేఖలో ప్రధానిని కోరారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య లేకుండా కమిషనర్లు చూడాలని సీఎం ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని సూచించారు. అనంతరం ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం రోడ్డు మార్గంలో బయల్దేరారు. సూర్యాపేట సమీపంలోని టీఎన్ఆర్ గార్డెన్స్ లో జిల్లాలో వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అక్కడి నుంచి ఖమ్మం వెళ్లనున్నారు. రాత్రి ఖమ్మంలో బస చేయనున్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.

Exit mobile version