JAISW News Telugu

Chandrababu Bail : ఎట్టకేలకు చంద్రబాబుకు విముక్తి.. గొప్ప ఊరట

Chandrababu Bail : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు కు బెయిల్ ను జస్టిస్ టి. మల్లికార్జున్ రావు తీర్పు వెల్లడించారు. ఈనెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఈనెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై వాదనలు గురువారం ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది.

చంద్రబాబు తరుఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మలపాటి శ్రీనివాస్, సీఐడీ తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తాజాగా సోమవారం బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.

ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆయన గుండె పరిమాణం పెరగడం వంటి కారణాలను కూడా కోర్టు పరిగణించినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో ఎవరూ జైలులో లేరని, అందరూ బెయిల్పైనే బయట ఉన్న కారణంగా బాబుకి కూడా బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Exit mobile version