Difficult for KCR : ఆ రెండు చోట్ల కేసీఆర్ కు చుక్కలేనా?
Difficult for KCR in Two Places : తెలంగాణలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో అధికారానికి దూరం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు షాకే ఎదురు కానుంది. కేసీఆర్ నామినేషన్ వేసిన రెండు చోట్ల గజ్వేల్, కామారెడ్డి లో నామినేషన్ల జోరు పెరిగింది. కేసీఆర్ పై ఉన్న కోపంతోనే నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది.
2018ఎన్నికల్లో కూడా ఇలాగే చేసినా అప్పుడు అంత ప్రభావం చూపలేదు. కానీ ఈసారి కేసీఆర్ ను ఓడించాలనే తపన అందరిలో కనిపిస్తోంది. ప్రభుత్వం చేసిన తప్పిదాలు ప్రజలకు ముప్పులుగా పరిణమిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతలను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. వారి ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. పదేళ్ల కాలంలో ప్రజలను నానా తిప్పలు పెట్టారు.
రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ల జోరు కొనసాగింది. 2018లో 23 మంది నామినేషన్లు వేస్తే 13 మంది నిలబడ్డారు. ఇప్పుడు మాత్రం కామారెడ్డిలో 102 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. కేసీఆర్ ను మట్టి కరిపిస్తామని ప్రతిజ్ణ చేస్తున్నారు. కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న వారిలో రైతులు, అమరవీరుల కుటుంబాలు, ఇతరులు ఉన్నారు.
గజ్వేల్ లో 154 మంది బరిలో ఉన్నారు. గల్ఫ్ బాధితుల ఓట్లే 30 వేలుంటాయి. కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే నామినేషన్లు వేశారు. గజ్వేల్, కామారెడ్డిలలో కేసీఆర్ ను ఓడించాలనే ఉద్దేశంతోనే అంత మంది పోటీలో నిలవడం విశేషం. తెలంగాణ ప్రభుత్వంపై కోపం పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో వారి కోపాన్ని ప్రదర్శించి ప్రభుత్వాన్ని అధికారంలోకి రానీయకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.