JAISW News Telugu

Revanth-Chandrababu : శిష్యుని బాటలో గురువు

Revanth-Chandrababu

Revanth-Chandrababu

Revanth-Chandrababu : గురువు బాటలో శిష్యుడు నడిచిన చరిత్ర ఉంది. గురువు ఎలా అభివృద్ధి చెందాడో తెలుసుకొని శిష్యుడు ప్రగతి సాధిస్తాడు. గురువు మాట జవదాటకుండా పనిచేసి మెప్పు పొందిన వారి గురించి చరిత్రలో చదువుకున్నాం. ఎక్కడైనా గురువు బాటలోనే శిష్యులు నడిచిన కథలు ఎన్నో ఉన్నాయి కానీ చరిత్ర తిరగరాసినట్టు కనబడుతోంది నేటి ఎన్నికల సరళిని గమనిస్తే. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రోజు,రోజుకు పెరిగిపోతోంది. అధికారం కోసం ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. సీఎం కుర్చీ ఎక్కడానికి పొత్తులు పెట్టుకున్నాయి. కలవని స్నేహాన్ని కలుపుకున్నాయి. అధికారమే లక్ష్యముగా పావులు కదుపుతున్నాయి. దక్షణ భారత దేశంలో ముందుగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకొంది.ఇచ్చిన హామీల పుణ్యమో, కాంగ్రెస్ మీద ఉన్న అభిమానమో కానీ మొత్తానికి కాంగ్రెస్ కు కన్నడ ప్రజలు పట్టం కట్టారు.

కర్ణాటక కాంగ్రెస్ ఇచ్చిన హామీని తెలంగాణ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాపీ కొట్టారు. అక్కడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలుగజేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు. ఆ హామీతో పాటు మరికొన్ని హామీలను కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఎట్టకేలకు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ను పక్కకుపెట్టి కాంగ్రెస్ కు ప్రజలు అధికారాన్ని అప్పగించారు.

ఎవరు ఒప్పుకున్నా,ఒప్పుకోక పోయినా చంద్రబాబుకు రేవంత్ రెడ్డి శిష్యుడే  అంటారు. రాజకీయ గురువు అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు శిష్యుడు ఇచ్చిన హామీనే ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో ఇచ్చారు. తాము అధికారం లోకి వస్తా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందజేస్తామని ప్రచారం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ధరణి రద్దు చేస్తాం అంటూ ప్రచారం చేసారు. అధికారంలోకి రాగానే ధరని స్థానంలో కొత్త విదానం అమలు చేస్తామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రవేశ పెట్టిన ల్యాండ్ టైటిల్ ఆక్ట్ చట్టాన్ని తాము రద్దు చేసి, దాని స్థానంలో కొత్త విధానంతో పథకాన్ని తీసుకు వస్తామని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.

ఈ విధంగా శిష్యుడు రేవంత్ రెడ్డి అమలుచేసిన మ్యానిఫెస్టోను  గురువు చంద్రబాబు నాయుడు కాపీ కొట్టాఋ. ఇది ఈమేరకు ఫలించనుందో ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version