
CM Jagan House
ABVP-CM Jagan House : 25 వేల పోస్ట్ ల తో మెగా డి ఎస్ సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి లో ఉన్న సీఎం నివాసం పుట్టడించేం దుకు ఎబివిపి విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నిం చా రు. దీంతో విద్యార్థి సంఘ నేతలను పోలీసు లు అదుపులోకి తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసుల అదుపులో ఉన్న విద్యా ర్థులను బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పరామర్శించారు. బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ మాట్లాడుతూ డీఎస్సీ ప్రకటించ మంటే అరెస్టులు చేస్తున్నారనీ ఆయన మండి పడ్డారు. నిన్న ప్రకటించిన డీఎస్సీ ఉపాధి కోసం కాదు, అది కేవలం ఎన్నికల డిఎస్సీ మాత్రమే అని ఆయన ఆరోపించారు.
ఏబీవీపీ కార్యకర్తలు అసాంఘిక శక్తులు కాదు, వారే రేపటి భావి భారత పౌరులనీ పోలీసులు అసభ్య పదజాలంతో దూషించడం యువత పట్ల ప్రభుత్వ వైఖరికి నిదర్శనం అన్నారు. సిద్ధమంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు, విద్యార్థులు కూడా మిమ్మల్ని గద్దె దించేందుకు సిద్ధంగానే ఉన్నారనీ ఆయన అన్నారు.