Botsa Satyanarayana : వైసీపీపై ఆధారపడే పార్టీ కేంద్రంలో గెలవాలి: మంత్రి బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana
Botsa Satyanarayana : ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. నామికనేషన్ల ఘట్టం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వైసీపీపై ఆధారపడే పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అలా వస్తే రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాల కోసం మాట్లాడవచ్చని, అది తమ స్వార్థమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగలేదని అన్నారు. పలు అంశాలను ఉదహరించారు.
ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స తప్పుపట్టారు. కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లడాల్సి ఉంటుందని, ఏది పడితే అది మాట్లాడటం, నోటికి వచ్చినట్లు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.