JAISW News Telugu

Andhra Pradesh: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

Andhra Pradesh: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని మూడేళ్ల పాటు చంద్రబాబు, లోకేశ్ లను సోషల్ మీడియా మాధ్యమాల్లో నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారంటో ఏయూ లా కాలేజీకి చెందిన అంజనప్రియ అనే విద్యార్థిని శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక స్త్రీగా కొడాలి నాని తిట్ల పురాణాన్ని సహించలేకపోయానని పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

కాగా, ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలను, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసుకొని వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.

Exit mobile version