కృష్ణా నదిలో వరద ఉధృతి కారణంగా మంతెన సత్యనారాయణ ఆశ్రమం సమీపంలో కరకట్టకు ఉన్న గేటు వద్ద నీరు లీకవుతోంది. ఆదివారం అర్ధరాత్రి ఆ ప్రాంతాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ పరిశీలించారు. సుమారు 5 గంటల పాటు వరద నీటిని అరికట్టడానికి అధికారులు, స్థానికులు తీవ్రంగా శ్రమించారు. కాని మళ్లీ లీకేజీ ప్రారంభమైంది. సోమవారం ఉదయం కరకట్ట వద్ద వరద నీరు లీకవుతున్న ప్రాంతాన్న సీఆర్డీఏ అధికారులు పరిశీలించారు. కంకర వేసి వరదను అరికట్టాలని సిబ్బందికి సూచించారు.