Ramoji Rao: శివాజీ గణేషన్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్ తో రామోజీరావు.. అరుదైన చిత్రం

Ramoji Rao: మీడియా మొఘల్ రామోజీరావు మరణంతో ఆయనతో, ఆయన చుట్టూ ఉన్న జ్ఞాపకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మీడియాతో పాటు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు రామోజీరావు. ఎన్నో సినిమాలను నిర్మించారు. తన చిత్ర నిర్మాణ సంస్థకు ‘ఉషా కిరణ్ మూవీస్’ అని పేరు పెట్టారు. ఇది 1983లో స్థాపించారు. రాను రాను ఇది రామోజీ గ్రూప్స్ లో ఒక భాగంగా మారింది. ఈ బ్యానర్ పై 80కి పైగా సినిమాలు వచ్చాయి. ఎక్కువ భాగం తెలుగులో కాగా.. కన్నడ, తమిళం, హిందీ భాషల్లో కూడా ఉన్నాయి.

ఈ బ్యానర్ నుంచి మొదటి సినిమా 1984 లో శ్రీవారికి ప్రేమలేఖ, నరేష్, పూర్ణిమ జంటగా నటించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించారు. ఇది బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ బ్యానర్ ఎంతో మంది గొప్ప గొప్ప నటులను ఇండస్ట్రీకి ఇచ్చింది. ప్రతీ ఒక్కటీ నూతనంగా ఉండాలని రామోజీరావు భావించేవారు. అందుకే వీలైనంత ఎక్కువ మంది నూతన నటీ నటులతో తన బ్యానర్ లో సినిమాలు తీసేవారు.

ఇక అలనాటి నటులతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. కేవలం నటులతోనే కాదు. వారి తల్లిదండ్రులతో కూడా బంధం ఏర్పరుచుకునేవారు రామోజీరావు. వారు కూడా రామోజీరావును కన్న కొడుకులతో సమానంగా చూసుకునేవారు. ఎన్టీఆర్ తండ్రికి రామోజీరావు అంటే మంచి గుర్తింపు ఉండేది. కేవలం తెలుగే కాదు తమిళం, కన్నడ, హిందీ భాషల నటులతో కూడా ఆయన అనుబంధం ఏర్పరుచుకున్నారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ అంటే అప్పట్లో యమా క్రేజ్ ఉండేది.

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి ఉన్న ఈ ఒక అరుదైన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో
వైరల్ అవుతుంది. శివాజీ గణేషన్, అక్కినేని నాగేశ్వర్ రావు లాంటి ధిగ్గజ నటుల సన్మానం కార్యక్రమంలో ఎన్టీఆర్, ఆయన తండ్రి, రామోజీరావు పాల్గొన్నారు.

TAGS