Allu Arjun: మెగా ఫ్యామిలీపై పుష్ప మరింత ఫైర్ అయ్యాడా?
Allu Arjun: మెగా-అల్లు కుటుంబాల మధ్య మొన్నటి ఎన్నికలు చిచ్చు పెట్టాయనే పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడంతో సినీ పరిశ్రమ నుంచి ఎంతో మంది వెళ్లి అటు పవన్ కల్యాణ్ ను, ఇటు సీఎం చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. కానీ మెగాస్టార్ చిరంజీవికి వెన్నెముకలా ఉండే అల్లు అరవింద్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇప్పటి దాకా కలవలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఎన్నికలు చిచ్చు పెట్టాయంటూ రూమర్లు వస్తున్నాయి. దీనిపై మెగా, అల్లు కుటంబాలు ఏ మాత్రం స్పందించడం లేదు.
బన్నీ వైఖరే వైరానికి కారణమా?
బన్నీ వైఖరే వైరానికి కారణమవుతున్నదంటూ పలువురు పేర్కొంటున్నారు. పలు సినిమా ఈవెంట్లలో బన్నీ వ్యవహరించిన తీరే ఇందుకు ఉదాహరణ అని చెబుతన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాన్ వైసీపీ వ్యతిరేకంగా పోరాడితే, బన్నీ మాత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసి వైరానికి కారణమయ్యాడని వారి సన్నిహితులు చెబుతున్నారు. గతంలో సినిమా ఈవెంట్లలోనూ చెప్పను బ్రదర్ అంటూ వివాదానికి ఆజ్యం పోశాడు. ఇక మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. నాకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తానంటూ చేసిన వ్యాఖ్యలను మెగా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని చేశాడని పలువురు చర్చించుకుంటున్నారు. ఆ వేదికపై బన్నీ మాట్లాడిన ప్రతీ మాటను మెగా ఫ్యామిలీకే అపాదిస్తున్నారు. నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తానంటూ చేసిన వ్యాఖ్యలు నంద్యాల అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయంలో స్పష్టతనిచ్చినట్లు అర్థమవుతుంది. కానీ నాకు నచ్చితే వస్తా అనే వ్యాఖ్యతో ఈ వివాదానికి మరింత ఫైర్ అంటించాడని అనుకుంటున్నారు. దీంతో మెగా, అల్లు ఫ్యాన్స్ ఈ ఫైర్ లోకి చొచ్చుకెళ్లి ఇంకెంత కొట్టుకుంటారో చూడాల్సిందే.