JAISW News Telugu

Tollywood: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్నటువంటి అగ్ర నటులు ఎవరో తెలుసా

Tollywood

Tollywood

Tollywood: సినిమా ఇండస్ట్రీలో కాస్త ఎదిగిన తర్వాత డబ్బున్న బిగ్ స్టార్ల కూతుర్లను గాని వ్యాపారవేత్తల కూతుర్లను గాని పెళ్లి చేసుకునే అలవాటు ప్రస్తుత నటీనటుల్లో నడుస్తోంది. కానీ గతంలో ఉన్నటువంటి చాలా మంది హీరోలు తమ మేన మరదలను పెళ్లి చేసుకొని ఆ తర్వాత సినీ రంగంలో అచంచలమైన విజయాలను సాధించారు. అలాంటి కొంతమందిని ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీ రామారావు తెలుగు చలనచిత్ర రంగంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి గా పేరుపొందిన నందమూరి తారక రామారావు తన మేన మరదలు బసవతారకమును పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన సందర్భంగా చెబుతుంటారు.

మరో అగ్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా అన్నపూర్ణ దేవి అనే మరదలను పెళ్లి చేసుకొని అనంతరం సినిమాల్లో రాణించారు. మరో స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మరదలు ఇందిరా దేవిని 1961 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఇందిరా దేవి కృష్ణల కొడుకే మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు తెలుగు టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు.

రీసెంట్గా మరదలను పెళ్లి చేసుకున్న వారిలో తమిళ హీరో కార్తీ తెలుగు హీరో ఆది కూడా చేరిపోయారు. సాయికుమార్ కొడుకు ఆది తన మరదలు అరుణ ను పెళ్లి చేసుకున్నాడు. సినీ హీరో కార్తీక్ తన మరదలు రజినిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తమ సొంత మరదలు అనే పెళ్లి చేసుకొని తమ కెరీర్లో సుస్థిరంగా నిలబడ్డారు.

సీనియర్ ఎన్టీఆర్ సైతం ఇలా మేన మరదల్ని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక అగ్రస్థానం ఏర్పరచుకొని ఎన్నో వేల మందికి లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. నటవిఖ్యాత సార్వభౌమ ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Exit mobile version