Keedaa Cola:తరుణ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ `కీడా కోలా`. చైతన్యరావు, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గత నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది.వెండితెరపై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఆహా గోల్డ్ సబ్స్‌స్క్రైబర్లకు మాత్రం ఒక్క రోజు ముందుగానే అంటే డిసెంబర్ 28 నంచి అందుబాటులో ఉండనున్నట్టు సంస్థ తెలిపింది.
రానా సమర్పణలో రూపొందిన ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో రఘురామ్, రవీంద్ర విజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కథేంటంటే..వాస్తు (చైతన్యరావు), అతని తాత వరదరాజు (బ్రహ్మానందం) లాయర్ అయిన కౌశిక్ (రాగ్ మయూర్) వీళ్లందరి ధ్యేయం డబ్బు సంపాదించడమే. తాత కోసం కొన్న కూల్ డ్రింక్ కీడా కోలా బాటిల్‌లో బొద్దింకను చూపించి యజమానిని బ్లాక్ మెయిల్ చేయాలని ప్లాన్ చేస్తారు.
రూ.5 కోట్ల నుంచి బేరసారాలు మొదలవుతాయి. మరోవైపు జీవన్‌కు కార్పొటర్ కావాలని ఆశ. 20 ఏళ్లు జైలుతో ఉండి బయటకు వచ్చిన తన అన్న నాయుడు అండతో ఆ ప్రయత్నాల్లోకి దిగుతాడు. జీవన్ కార్పొటర్ కావాలన్నా డబ్బే అవసరం కావడంతో అందుకోసం వీళ్లు కూడా ఓ ప్యూహం పన్నుతారు. మరి వీళ్లందరి ప్రయత్నాలు ఫలించాయా? వాస్తు గ్యాంగ్, జీవన్ గ్యాంగ్ ఎలా కలిశారు? ఇంతకీ కోలాలో బొద్దింక ఎలా పడింది వంటి తదితర విషయాలు తెలియాలంటే `కీడా కోలా` చూడాల్సిందే.