Akhil Akkineni:అగ్ర కథానాయకుల వారసులుగా అరంగేట్రం చేసిన వాళ్లలో కొంత మంది మాత్రమే స్టార్లుగా రాణిస్తూ తమదైన మార్కు ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇప్పటికీ స్టార్ డమ్ కోసం శ్రమిస్తూనే ఉన్నారు. ఈ జాబితాలో నిలుస్తున్న హీరో అక్కినేని అఖిల్. కింగ్ అక్కినేని నాగార్జున నట వారసుడిగా నాగచైతన్య తరువాత సినిమాల్లోకి ప్రవేశించిన అఖిల్ ఇప్పటికీ తన మార్కు హిట్ ని దక్కించుకోలేకపోయాడు. ఇప్పటికీ హిట్ కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు.
చైల్డ్ ఆర్టీస్ట్‌గా `సిసింద్రీ` సినిమాతో అలరించి అక్కినేని అభిమానుల్ని ఖుషీ చేసిన అఖిల్ తన పేరుతో రూపొందిన `అఖిల్` సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. హీరోగా తొలి సినిమాతో భారీ డిజాస్టర్‌ని సొంతం చేసుకుని అక్కినేని అభిమానుల్ని షాక్ కు గురి చేసిన అఖిల్ ఇప్పటికీ అదే పంథాని కొనసాగిస్తూ సరైన సక్సెస్‌ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. ఒకే సారి స్టార్ అనిపించుకోవాలన్న అతని ఆలోచనే అతని కెరీర్‌కు ప్రధాన మైనస్‌గా మారుతోంది.
ఎలాగైనా ఈసారి భారీ బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోవాలని `స్పై` మూవీలో నటించాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర భారీ హంగులతో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా నిర్మించిన `ఏజెంట్` సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో స్పెషల్ క్యారెక్టర్ చేయించినా పెద్దగా ఫలితం లేకపోయింది. దీంతో షాక్‌కు గురైన అఖిల్ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే దుబాయ్‌కి వెళ్లిపోవడం.. సినిమా విషయంలో తప్పులు జరిగాయని, స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదని, ఈ విషయంలో తప్పు చేశామని నిర్మాత అనిల్ సుంకర స్వయంగా ప్రకటించిన తెలిసిందే.
ఇదిలా ఉంటే భారీ డిజాస్టర్ తరువాత అఖిల్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నాడని, ఈ క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించబోతున్నారని, ఈ సినిమా ద్వారా యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన `సాహో`కు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసిన అనిల్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కానున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం అసాధ్యం అని తెలుస్తోంది. వంద కోట్ల బడ్జెట్. పీరియాడికల్ స్టోరీ.. వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్, కొత్త దర్శకుడు అనిల్‌తో ఈ సాహసం చేయడం రిస్క్ అని యువీ క్రియేషన్స్ వర్గాలు భావిస్తున్నాయని తెలిసింది. పైగా దర్శకుడిగా పరిచయం కానున్న అనిల్, అఖిల్ ఇద్దరు కలిసి ఈ సినిమా కోసం కథని `వైకింగ్స్` అనే యుద్ధ కళ నేపథ్యంలో రెడీ చేశారని, అదే యువీ క్రియేషన్స్ వారు ఈ ప్రాజెక్ట్ విషయంలో వెనక్కు తగ్గేలా చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకు `ధీర` అనే టైటిల్ ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.