TFAS Diwali Celebrations:  తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో అట్టహాసంగా దీపావళి సంబరాలు

TFAS Diwali Celebrations

TFAS Diwali Celebrations

TFAS Diwali Celebrations: అమెరికాలోని న్యూజెర్సీలో దాదాపు 40సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు సేవలందిస్తున్న సంస్థ తెలుగు కళా సమితి. 40ఏళ్లలో భారీగా ప్రజా ఆదరణ పొందింది. ఈ నెల 23న దీపావళి వేడుకలను నిర్వహించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు మధు ప్రతికాముఖంగా వెల్లడించారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించేందుకు తెలుగు కళాసమితి ఈ వేడుకలను నిర్వహించింది.

ఈ కార్యక్రమాలు మానవ సంబంధాలను పెంపొందించడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించగలవని మధు పేర్కొన్నారు. నవంబర్ 23న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ నైట్, ఫ్యాషన్ షో, సామెతల వేట – మేడతకు మేత పేరుతో సాహిత్య పోటీలు, ఇతర కార్యక్రమాలు చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మన్నవ సుబ్బారావు, ఉపేంద్ర చివుకుల, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకరమంచి రఘుశర్మ పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖ కమెడియన్ కమ్ మిమిక్రీ ఆర్టిస్ట్ శివా రెడ్డి ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. అలాగే గాయకులు భరద్వాజ్, దివిక, యామిని ఘంటసాల కీర్తనలతో ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు చరణ్ పాకాల లైవ్ ప్రోగ్రామ్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో  టాలీవుడ్ హీరోయిన్లు, సెలబ్రిటీలు సందడి చేశారు.

 More Images : TFAS 41st Year Pre Deepawali Kick Off Celebrations