SINDA Deeval Gifts: ‘సింగపూర్ ఇండియన్ డెవలప్‌మెంట్ అసోసియేషన్’ (SINDA) అనేది సింగపూర్‌లోని భారతీయ కమ్యూనిటీ. అక్కడ ఉన్న ప్రవాస భారతీయుల సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి 1991లో ఈ అసోసియేషన్ ఏర్పాటైంది.
సింగపూర్ పురోగతికి తోడ్పడడంలో ఇతర వర్గాలతో కలిసి భారతీయుల మంచి విద్యావంతులైన, ఆత్మవిశ్వాసంతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు సిండా చురుకుగా పని చేస్తుంది. లక్ష్యాలను నెరవేర్చేందుకు అనేక మంది వలంటీర్లు పని చేస్తున్నారు. వీరంతా పాఠశాలలు, అట్టడుగు సంస్థలతో సన్నిహితంగా ఉంటారు. ఈ ప్రక్రియలో, సింగపూర్ ఇండియన్ కమ్యూనిటీకి మూలస్తంభంగా పనిచేసే విశ్వసనీయమైన సంస్థగా సిండా స్థిరంగా పరిణామం చెందింది.
తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సిండా తరుఫున గూడి బ్యాగ్ లను పంపిణీ చేశారు. ప్రవాస భారతీయులుగా ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన వారికి సిండా ప్రతీ ఏటా దీపావళి కానుకలను అందజేస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా దీపావళి అలంకరణ సామగ్రితో పాటు ఆహార వస్తువులు, పండుగ ఖర్చు కోసం 120 సింగపూర్ డాలర్లను అందజేసింది. సిడా పిలుపుతో వారం పాటు 05 నవంబర్, నుంచి నవంబర్ 11వ తేదీ వరకు తెలంగాణ కల్చరల్ సొసైటీ వలంటీర్లను సామగ్రిని పంపిణీ చేశారు.
సొసైటీ అధ్యక్షుడు గడప రమేశ్ బాబు, ఇతర సభ్యులు రావుల సుగుణాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వెంగళ విజయ మోహన్, పెరుకు శివ రామ్ ప్రసాద్, పలిక ప్రణీష్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ మొదలైన వారికి సిండా కృతజ్ఞతలు తెలిపింది.