Shanti Homam For Chandrababu : ఫిలడెల్ఫియాలో చంద్రబాబు కోసం శాంతి హోమం..

Shanti Homam For Chandrababu
Shanti Homam For Chandrababu : స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. ఇక ఆయన జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కేసు ఇంకా విచారణలోనే ఉందని కేటాయించిన తేదీల్లో సంబంధిత సీబీఐ కోర్టుకు రావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయన ఆరోగ్యం విషయంలో కోర్టు గతంలో ఇచ్చిన మూడు వారాల బెయిల్ 28తో ముగియనుండగా. ఆయన 29న జైలుకు వెళ్లాల్సి ఉంది. కానీ నిన్న (నవంబర్ 20) జరిగిన విచారణలో కోర్టు మధ్యంత బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలుకు వెళ్లే అవసరం లేదని తెలుస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CBN) అక్రమ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని, ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఫిలడెల్ఫియా ఎన్ఆర్ఐలు కోరుతున్నారు. చంద్రబాబు కోసం శాంతి హోమం నిర్వహించారు. మాల్వేర్న్ సాయిబాబా ఆలయంలో వేద పండితుల మంత్రోశ్చరణాల మధ్య నిర్వహించిన శాంతి హోమంలో 300 కు పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
చంద్రబాబు మళ్లీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా రావాలని, తెలుగు జాతి పునర్ వైభవానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. బెయిల్ రావడం నిజంగా ఆనందంగా ఉందన్నవారు తమ హోమం ఫలించిందని చెప్పారు. ఫిలడెల్ఫియా టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ హోమం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు.