Plane Hit The Car: కారును ఢీ కొట్టిన విమానం.. గాలిలో కాదు.. ఎక్కడంటే?

Plane Hit The Car: గాలిలో ఎగిరే విమానం.. నేలపై తిరిగే కారు.. రెండు ఢీ కొనడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అవునండి నిజమే.. రెండు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. అయితే కారు గాలిలోకి ఎగరలేదు కాబట్టి విమానమే నేలపైకి వచ్చింది. టెక్సాస్ లో జరిగిన ఈ ప్రమాదంకు సంబంధించి విజువల్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

ప్రమాదం ఎలా జరిగిదంటే..
టెక్సాస్ లోని మెక్‌కిన్నేలో ఓ విమానం రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. శనివారం (నవంబర్ 11) మధ్యాహ్నం జరిగింది. ఏరో కౌంటీ విమానాశ్రయంలో Iv-P ప్రాప్‌జెట్‌ ప్లెయిన్ రన్‌వే పై టేకాఫ్‌ అయ్యింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల పైలట్‌ దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశాడు. దీంతో ఆ ప్లెయిన్ రన్ వే చివరి వరకు వచ్చినా ఆగలేదు. ఎదురుగా ఉన్న కంచెను కూడా ఢీ కొంది. కంచెను కూలుస్తూ రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును వేగంగా ఢీ కొంది.

ఎయిర్ పోర్ట్ ఎమర్జెన్సీ బృందాలు అక్కడికి వచ్చాయి. కారు డ్రైవర్ తో పాటు, పైలట్ ను రక్షించాయి. వీరిలో ఒకరికి స్వల్ప గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం సంభవించిన రోడ్డును కొన్ని గంటలపాటు మూసి వేశారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ఏంటి? ప్రమాదానికి కారణం ఏంటి? అనే దానిపై యూఎస్ ఫెడరల్ ఏవియేషణ్ అథారిటీ దర్యాప్తు ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.

TAGS