Mannava Mohan Krishna : గుంటూరు వెస్ట్ సీటు పొందిన మన్నవ మోహన కృష్ణకు డా. జై గారు సహా ప్రవాసుల అభినందనలు
Mannava Mohan Krishna : ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా మన తెలుగు వారు ప్రతీరంగంలోనూ తమదైన ముద్ర వేస్తూనే ఉన్నారు. కాదేవీ మనకు అనర్హం అన్నట్టుగా దూసుకెళుతున్నారు. ముఖ్యంగా అమెరికాలోని ప్రవాస భారతీయులు అక్కడ రాజకీయంగా.. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందారు. టెక్నాలజీ సహా సాఫ్ట్ వేర్ ఇతర రంగాల్లో అగ్రపథాన కొనసాగుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి మన ఎన్నారైలు చేసే సేవ అంతా ఇంతాకాదు.. ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నేతలు అమెరికాలో ఆ పార్టీ తరుఫున వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. ప్రముఖ ఎన్నారై మన్నవ మోహన్ కృష్ణ సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా 2021లో స్టేట్ కమిటీలో నియమితులయ్యారు. నిబద్ధతతో ఫుల్ టైం పార్టీ కోసం పనిచేస్తే ఎలాంటి గుర్తింపు దక్కుతుందో ఇప్పుడు ఆయన నిరూపించారు. పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ ముందుంటుందనే ఒక క్లియర్ మెసేజ్ ఇప్పుడు ప్రవాసులకు పంపినట్టైంది.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రముఖ ఎన్నారై మన్నవ మోహన్ కృష్ణకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే సీటును ఖరారు చేసింది. దీంతో ఎన్నారైల సంబరాలు అంబరాన్నంటాయి.. వారంతా సమావేశమై మోహన్ కృష్ణకు అభినందనలు తెలిపారు.
అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో గల గోదావరి రెస్టారెంట్ లో శనివారం టీడీపీ+జనసేన ఉమ్మడి కార్యక్రమంలో మన్నవ మోహన్ కృష్ణకు అభినందన సభను నిర్వహించారు. ‘మేము సైతం బాబు కోసం’ అంటూ ప్రవాస తెలుగు వారు సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, సానుభూతిపరులు, యూబ్లడ్ యాప్ ఫౌండర్ జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు పాల్గొని ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మన్నవ మోహన్ కృష్ణ ఏం మాట్లాడారంటే..
మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ఏపీలో యువత బానిసగా మారారని.. గంజాయికి అడిక్ట్ అయిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో సామాన్యులు ఖరీదైన మద్యం కొనలేక గంజాయి, సారా తాగి మరణిస్తున్నారని.. ఏపీలో ఈ పరిస్థితులు మారాలంటే టీడీపీ రావాలన్నారు.. జగన్ హామీనిచ్చిన రెండున్నర లక్షల ఉద్యోగాలు దేవుడు ఎరుగని.. ఉద్యోగాలు రాక యువత నరకం అనుభవిస్తున్నారని తెలిపారు.
*డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు మాట్లాడుతూ..
తెలుగుదేశం, జనసేన కలిసి జగన్ కంటే 10 రెట్లు సేవా చేస్తామని.. దీన్ని ఖారఖండీగా చెబుతున్నామని డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు ఈ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. 5 కోట్ల ఆంధ్రులకు వెళ్లాల్సిన మెసేజ్ ఇది అని అన్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు గారు వచ్చేసారి అధికారంలోకి వస్తారు అంటూ డా. జై గారు స్పష్టం చేశారు..
ఎన్నారై అయ్యిండి టీడీపీలో గుంటూరు వెస్ట్ సీటు పొందిన మన్నవ మోహన్ కృష్ణను ప్రవాసులు అభినందించారు. మన్నవను చీఫ్ గెస్ట్ గా పిలిచిన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. జనసేన లీడర్ ఎన్నారై చంటి స్పీచ్ సభికులను ఆకట్టుకుంది.
మాట్లాడిన చాలా మంది టీడీపీ, జనసేనలకు మద్దతుగా మాట్లాడారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ కలవని విధంగా ఈ రెండు పార్టీల నేతలు కలిసి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.
న్యూజెర్సీలో ఔట్ సైడ్ ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉన్నా కూడా ఈ సభకు 200 మందికి పైగా హాజరై విజయవంతం చేశారు.