Diwali Celebrations by TAGKC : TAGKC ఆధ్వర్యంలో వైభవంగా దీపావళి సంబురాలు
Diwali Celebrations by TAGKC : తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) 1981లో ఏర్పాటైంది. రాను రాను గ్రేటర్ కాన్సాస్ సిటీలో తెలుగు కమ్యూనిటీలో అంతర్భాగంగా మారింది. భారత స్వాతంత్ర దినోత్సవం ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వంటి భారతీయ కమ్యూనిటీ ఈవెంట్‌లలో చురుగ్గా పాల్గొంటోంది. దీంతో పాటు భారతీయ పండుగలకు పెద్ద ఎత్తున ఈవెంట్లను ఏర్పాటు చేస్తుంది. వేసవిలో పిక్నిక్ వంటి సాంఘిక పరమైన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. వీటితో పాటు మ్యూజికల్ నైట్‌లు, ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్‌లు, పూజలు, కిడ్‌ఫెస్ట్ మొదలైన అనేక ఇతర సాహిత్య, సంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
TAGKC ఆధ్వర్యంలో యూఎస్ లోని కాన్సాస్ నగరంలోని బ్లూ వ్యాలీ నార్త్ హైస్కూల్ లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో 700 మంది తెలుగు వారు పాల్గొని ఆనందంగా గడిపారు. ప్రార్థనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమం ఆసాంతం అలరించింది. కార్తీక్ వాకాయల, శ్రీలేఖ కొండపర్తి యాంకర్లుగా వ్యవహరించారు. సంస్కృతిని ప్రతిభించించే కూచిపూడి, భరత నాట్యం, జానపద పాటలకు నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు ఈ ఈవెంట్ కు హైలెట్ గా నిలిచాయి.
చిన్నారుల డాన్స్ లే కాకుండా పెద్ద వాళ్లకు కూడా నృత్య పోటీలు నిర్వహించారు. ఇంకా ఆది శంకరాచార్య నాటిక, శ్రీరాముడి జీవిత విశేషాలను నృత్యం ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించారు. అనంతరం TAGKCకి విశేష సేవలందిస్తున్న మంజుల సువ్వారి, సుచరిత వాసం ను ప్రెసిడెంట్ నరేంద్ర దూదెళ్ల, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీధర్ అమిరెడ్డితో పాటు కార్యవర్గం సత్కారం చేసింది. వీటితో పాటు పలు అంశాల్లో ప్రతిభ చూపిన వారికి అసోసియేషన్ తరుఫున సర్టిఫికెట్లు ఇచ్చి సన్మానం చేశారు. వాటిలో
కార్యక్రమం చివరలో TAGKC ఉపాధ్యక్షుడు చంద్ర యక్కలి గౌరవ వందనం సమర్పించారు. జాతీయ గీతం జనగణమణ తో కార్యక్రమాలు ముగించారు. అనంతరం ఏర్పాటు చేసిన విందులో ప్రత్యేక వంటకాలు నోరూరించాయి. కార్యక్రమానికి సహకరించిన దాతలు, ప్రముఖులకు అసోసియేషన్ తరుఫున ధన్యవాదాలు తెలిపారు.